Harish Rao | హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచింది.. వెలుగులోకి రేవంత్ రెడ్డి డ్రామాలు : హరీష్ రావు
Harish Rao | సీఎం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టేను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్వాగతించారు.
సత్యమేవ జయతే.. కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచింది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేశారు. సీఎం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కన పెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజ స్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యిందన్నారు హరీష్ రావు.
ఎవరు ఔనన్నా కాదన్నా… ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం.. అని హరీష్ రావు పునరుద్ఘాటించారు.
సత్యమేవ జయతే..
ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది.
ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్…
— Harish Rao Thanneeru (@BRSHarish) April 22, 2026
Read Also :
Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Telangana High Court | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

