న్యూఢిల్లీ : దేశమంతా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతున్న ఈ నేపథ్యంలో ఢిల్లీలో శుక్రవారం వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ హైకోర్టును శుక్రవారం మధ్యాహ్నం 2.11 గంటలకు బాంబు బ్లాస్ట్ చేస్తామంటూ ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది.
అలాగే ఎయిర్పోర్టు, జామ్నగర్ హౌస్, ద ఝండేవాలన్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, సాకేత్ లోని జిల్లా కోర్టులకు, ఢిల్లీ కంటోన్మెంట్ సబ్ డివిజనల్ కోర్టుకు కూడా బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబు నిర్వీర్య అధికారులు, డాగ్ స్వాడ్స్ రంగంలోకి దిగి పరిశీలించగా ఎలాంటి బాంబులు లేవని తేలింది. ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను పోలీసులు పెంచారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నారు.