మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 01:38:36

ధరణి వీక్షకులు కోటి

ధరణి వీక్షకులు కోటి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణికి ప్రజల నుంచి విశేషాదరణ లభిస్తున్నది. శుక్రవారం నాటికి పోర్టల్‌ను వీక్షించినవారి సంఖ్య కోటి దాటింది. పోర్టల్‌ను ప్రారంభించిన 22 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. సగటున రోజుకు 4.5 లక్షల మంది ధరణి పోర్టల్‌ను వీక్షించారని అధికారులు తెలిపారు. ఈ నెల 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకూ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ మేరకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ట్రయల్స్‌ నిర్వహించి, సాంకేతిక సమస్యలను అధిగమించి.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.