కవ్వంపల్లి భేషరతుగా క్షమాపణలు చెప్పాలి
దళితజాతి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి ప్రకాశ్ తక్షణమే దళిత సమాజానికి భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని బీఅర్ఎస్ సెల్ మానకొండూర్ నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేశారు.
- ఎమ్మెల్యే సోదరుడు ప్రకాశ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
- మీడియా సమావేశంలో బీఅర్ఎస్ ఎస్సీసెల్ నేతల డిమాండ్
మానకొండూర్, ఏప్రిల్ 30: దళితజాతి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి ప్రకాశ్ తక్షణమే దళిత సమాజానికి భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని బీఅర్ఎస్ సెల్ మానకొండూర్ నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాడికల్ మాజీ సర్పంచ్ గంట మహిపాల్తోపాటు దళిత సంఘాల నేతలు లింగాల లక్ష్మణ్, ఎనగందుల సుదర్శన్, కనుకుంట్ల అభిలాష్ మాట్లాడారు.
కవ్వంపల్లి ప్రకాశ్ ఒక దళితుడై ఉండి దళితజాతి ఆడబిడ్డల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఊసరవెళ్లిలా పార్టీలు మార్చే కవ్వంపల్లిదే డబ్బులకు అమ్ముడు పోయే చరిత్ర అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని దళిత ఆడబిడ్డలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి, అతని సోదరుడు ప్రకాశ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, దళిత సోదరీమణులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం దాహం తో దళితులను కించపరిచే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు వంతడ్పుల సంపత్, సంగుపట్ల మల్లేశం, వడ్లూరి శంకర్, ఈస్కుల్ల అంజయ్య, సుదర్శన్, బొజ్జ కోటిలింగం, కొమ్ము సంపత్, డప్పు తిరుపతి, ఎలుక దేవయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

