గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:32:15

ధరణితో భూ సమస్యలకు చెక్‌ : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధరణితో భూ సమస్యలకు చెక్‌ : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెగడపల్లి/గొల్లపల్లి: సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ దేశానికే దిక్సూచి అని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కొనియాడారు. మంగళవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి తాసిల్దార్‌ కార్యాలయంలో సేల్‌డీడ్‌ ద్వారా భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంగళాయిపేటకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు తోట మల్లయ్య, సత్తయ్య, శంకర్‌ అనే రైతులకు పట్టాదార్‌ పాసుబుక్‌లు అందజేశారు. ఆరు దశాబ్దాల నుంచి రైతుల భూ సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని కొప్పుల పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ రికార్డుల ప్రక్షాళన చేసి చాలావరకు సమస్యలను పరిష్కరించారని తెలిపారు. సమస్యలు పూర్తిగా పరిష్కరించాలనే ఉద్దేశంతో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతోపాటు ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2 కోట్ల ఎకరాల భూములను అందులో నమోదుచేయించారని పేర్కొన్నారు.