DGP Ravi Gupta | వనదేవతలను దర్శించుకున్న డీజీపీ రవిగుప్తా..
DGP Ravi Gupta | మేడారంలో గిరిజన దేవతలను రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీపీ శివధర్‌రెడ్డి దర్శించుకున్నారు. సమ్మక్క -సారలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా సోమవారం గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
DGP Ravi Gupta | మేడారంలో గిరిజన దేవతలను రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీపీ శివధర్‌రెడ్డి దర్శించుకున్నారు. సమ్మక్క -సారలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా సోమవారం గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం నోడల్ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర సమ్మక్క-సారలమ్మ జాతర అని తెలిపారు.
రెండు కోట్లకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రాబోవు నాలుగు రోజులు జాతర నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. సిబ్బందికి డ్యూటీ పాయింట్ల వద్ద సరైన అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణ జాతర నిర్వహణలో తొలి ప్రాధాన్యం ఉంటుందని, దానికి అనుగుణంగా సిబ్బందిని కేటాయించి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బందికి అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. డీజీపీ వెంట ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, ఇతర అధికారులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

