హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు జాతీయ మానవ హక్కు ల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీచేసింది. ఈ మేరకు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. తొక్కిసలాటలో లాఠీచార్జికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరపాలని సూచిం చింది. నాలుగు వారాల్లో ఘటనపై పూర్తి నివేదిక పంపించాలని డీజీపీ జితేందర్ను ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. న్యాయవాది రామారావు ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ ఈ విచా రణ చేపట్టింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన లాఠీచార్జి వల్లే రేవతి చనిపోయిందని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.