హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు సృజనాత్మకత, ముందుచూపు అవసరమని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘వ్యూహ ల్యాబ్స్- సైబర్ ఇన్నోవేషన్ హబ్’ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ‘వ్యూహ ల్యాబ్స్’ రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.
డిజిటల్ సెక్యూరిటీ పరికరాలను అభివృద్ధి చేసే వ్యవస్థను ‘వ్యూహ ల్యాబ్స్’ అందిస్తుందని సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. సైబర్ నేరాల నుంచి పౌరులు, సంస్థలను రక్షించేందుకు ‘వ్యూహ ల్యాబ్స్’ ఎంతో ఉపకరిస్తుందని హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సందీప్ శుక్లా చెప్పారు. 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన సైబర్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లు, విద్యా సం స్థలు, పరిశ్రమలు కలిసి సైబర్ భద్రతకు ఆధునిక పరిషారాలను రూపొందిస్తాయి. ఆంత్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహిస్తూ కొత్త ఆలోచనలను ఆవిషరించడం, పరిశోధించడం, వాటిని విసృ్తతంగా వినియోగించే ఉత్పత్తులుగా మార్చడం ఈ హబ్ ప్రధాన లక్ష్యం.