హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఈ నెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీనియర్ పోలీస్ అధికారులతో కలసి డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం పరిశీలించారు. సచివాలయం ప్రాంగణం మొత్తం కలియదిరిగి ఏర్పాట్లను తెలుసుకున్నారు.
ప్రారంభోత్సవం, అనంతరం నిర్వహించే సభ, వీవీఐపీల ప్రవేశం, పారింగ్ ఏర్పాట్లు, ప్రవేశమార్గంలో బందోబస్తు, తదితర ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ స్వాతి లక్రా, లా అండ్ ఆర్డర్ విభాగం ఏడీజీ సంజయ్‌కుమార్ జైన్, సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, తఫ్సీర్ అహ్మద్ పాల్గొన్నారు.