మహిళల భద్రతలో రాజీలేదు
మహిళల భద్రత విషయంలో రాజీ లేదని, వారి జోలికొస్తే సహించేది లేదని డీజీపీ అంజనీకుమార్ హెచ్చరించారు.
- ప్రభుత్వ చర్యలతో అతివల్లో ఆత్మైస్థెర్యం
- ఉమెన్స్ డే వేడుకల్లో డీజీపీ అంజనీకుమార్
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మహిళల భద్రత విషయంలో రాజీ లేదని, వారి జోలికొస్తే సహించేది లేదని డీజీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవానికి డీజీపీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల ద్వారా మహిళల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందని, తెలంగాణ పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ప్రధానంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్ విభాగం, మానవ అక్రమ రవాణా నిరోధ విభాగం, గృహహింస నిరోధ విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కొనియాడారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డీజీ శిఖాగోయల్ మాట్లాడుతూ 2014లో షీటీమ్‌లు, 2016లో భరోసా కేంద్రాలను ప్రారంభించినట్టు గుర్తుచేశారు. దేశంలో మరే రా్రష్ట్రంలో లేనివిధంగా పోలీసు నియామకాల్లో 33 శాతం ఉద్యోగాలను మహిళలకు కేటాయించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు అభిలాష బిస్త్, స్వాతి లక్రా, డీఐజీ సుమతి, మహిళా పోలీస్ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

