భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని పాల్వంచ పట్టణంలో గల కేటీపీఎస్ కర్మాగారాలను మంగళవారం తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సందర్శించారు. కేటీపీఎస్ 5,6, దశలలోని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగాఆర్టిజన్ కార్మికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అంతముందు ఆయన కర్మాగారం 56 కర్మాగారం గేటు వద్ద గల కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించారు.
అనంతరం తెలంగాణ తెలంగాణ జెన్క్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న శిక్షణతో పాటు కేంద్రానికి సంబంధించిన నూతన భవనాలను ప్రభాకార్‌రావు పరిశీలించారు .అనంతరం మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించేందుకు వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి..
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు