ముంబై : బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో నటి కత్రినా కైఫ్ పెళ్లికి అంతా రెఢీ అయ్యింది. రాజస్థాన్‌లోని మాదోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో మ్యారేజ్ వేడుక జరగనున్నది. అయితే ఈ పెళ్లికి సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా ప్రత్యేక భద్రతను కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ కథనం ఆంగ్ల మీడియాలో వచ్చింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు వ్యక్తిగత భద్రతను షేరా చూసుకుంటాడు. అయితే డిసెంబర్ 9వ తేదీన విక్కీ, కత్రినా పెళ్లికి సల్మాన్ బాడీగార్డ్ స్పెషల్ సెక్యూర్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ బాడీగార్డ్ అసలు పేరు గుర్మీత్ సింగ్. ఇతన్నే షేరా అని పిలుస్తారు. షేరాకు ప్రత్యేక సెక్యూర్టీ కంపెనీ ఉంది. దాని పేరు టైగర్ సెక్యూర్టీ.
ఇక విక్కీ, కత్రినా పెళ్లి జరుగుతున్న ప్రాంతంలో ఉన్న అన్ని ధర్మశాలలు.. సెక్యూర్టీ సిబ్బంది కోసం రిజర్వ్ అయ్యాయి. బౌన్సర్లతో పాటు ఇతర సెక్యూర్టీ సిబ్బంది సవాయి మాదోపూర్‌లో ఉన్న ధర్మశాలల్లో బస చేయనున్నారు. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ మధ్య మంచి ఫ్యామిలీ సంబంధాలు ఉన్నాయి. అయితే కత్రినా పెళ్లికి సల్మాన్ వస్తాడా రాదా అన్నది ఇంకా డౌట్‌గానే ఉంది. తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ తెలిపారు. వెడ్డింగ్ కోసం 120 మందికి ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత ముంబైలో రిషెప్షన్ ఇవ్వనున్నారు.