యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta)లక్ష్మీనరసింహా స్వామి(Lakshmi Narasimha Swamy Temple) ఆలయనికి భక్తులు(Devotees) పోటెత్తారు. భక్తుల రాకతో దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు క్యూలైన్లో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా, స్వామి వారి ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది.