యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహుడు వెలసిన యాదాద్రి( Yadadri ) కొండకు భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలువు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా యాదాద్రి కొండపై పార్కింగ్( Parking ) నిండి , వాహనదారులు కొండమీదికి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు.
కొండ కింద పార్క్ చేసి వెళ్దామన్నా సరిపడా బస్సులు లేక, నడుస్తూ వెళ్దామన్న ఇటు వైపు మెట్ల దారి లేకపోవడంతో భక్తులు నానా ఇక్కట్లు పడ్డారు. కనీసం సెలవు రోజుల్లో అయినా బస్సుల సంఖ్య పెంచరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.