వేములవాడ టౌన్, ఫిబ్రవరి 3: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం వసంత పంచమి(Vasantha Panchami) సందర్భంగా భక్తులతో(Devotees) పోటెత్తింది. రాజన్న దర్శనం కోసం భక్తులు వేకువ జామునే పవిత్ర ధర్మ గుండంలో స్నానం ఆచరించి తమ ప్రీతి మొక్కైన కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆలయంలో దాదాపు నాలుగు గంటల పాటు క్యూలైన్లలో నిలబడి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకే రాజన్నను దాదాపు 40 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..