యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు పలువురు దాతలు స్పందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన దేవసాని సుదర్శనం వజ్రమ్మ రూ. 50,004లు, శ్రీసాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు రేకుల అంజయ్య, పీ నర్సింహ, వాకిటి సురేష్ రెడ్డి రూ. 1,00,010లు సమర్పించారు. ఈ మేరకు వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలను అందజేశారు.