రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుత సర్కారు హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నాటి సంక్షేమపథకాలను ఇప్పటికే ఆపేసిన రేవంత్ సర్కారు.. ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్లు కనిపించడం ఇష్టం లేక ఈ అభివృద్ధి పనుల జోలికి వెళ్లడం లేదు. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో మొదలైన ఈ పనులు దాదాపు తుది దశకు చేరుకోగా, కొద్దిపాటి నిధులు విడుదల చేసేందుకు కూడా ఈ సర్కారుకు మనసొప్పడం లేదు.
గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఇప్పుడు ఈ అభివృద్ధి పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే తప్పేంటని ఆయా జిల్లాల వాసులు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి విషయంలోనూ రాజకీయ కుట్రలు పనికిరావని మండిపడుతున్నారు. చివరకు మౌలిక వసతులపైనా సర్కారు నిర్లక్ష్యంపై కన్నెర్రజేస్తున్నారు. వెంటనే ఈ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆయా జిల్లాల ప్రజలు కోరుతున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లా నల్లకుంటలో మూడేండ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలో మొదలైన పనులు కాంగ్రెస్ పాలనలో నిలిచిపోగా వెలవెలబోతున్న ఆడిటోరియం భవనం

నిజామాబాద్‌లో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కళాభారతి భవన నిర్మాణ పనులు కాంగ్రెస్ పాలనలో ఆగిపోయిన దుస్థితికి నిదర్శనం

మంచిర్యాల జిల్లా చెన్నూరులో పనులు ఆగిపోయిన 100 పడకల దవాఖాన భవనం

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో మధ్యలోనే ఆగిన ప్రభుత్వ పాఠశాల భవనం పనులు

రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో మధ్యలో అరకొరగానే మిగిలిపోయిన చెరువుకట్ట పనులు

కేసీఆర్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేటలో మొదలుపెట్టిన 1000 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులు ఆగిపోయిన వైనం

సిద్దిపేటలో బీఆర్ఎస్ సర్కారు మొదలుపెట్టిన రింగ్‌రోడ్డు పనులు ప్రస్తుతం ఆగిన దుస్థితి

కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ముందుకు సాగని సిద్దిపేట నర్సింగ్ కాలేజీ బిల్డింగ్ పనులు

నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద నత్తనడకన సాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు

సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ వెనుకాల పిల్లర్ల దశతోనే ఆగిపోయిన వెటర్నరీ కళాశాల పనులు

కరీంనగర్లో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన హరిత హోటల్ భవన నిర్మాణ పనులు కాంగ్రెస్ పాలనలో ఆగిపోయిన దుస్థితి

సిద్దిపేటలో అర్ధాంతరంగా నిలిచిపోయిన శిల్పారామం నిర్మాణ పనులు

నారాయణపేటలో ఆగిపోయిన జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు

కామారెడ్డిలో కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టగా.. రేవంత్‌రెడ్డి హయాంలో ఆగిపోయిన గాంధీ గంజ్ మార్కెట్ భవనం పనులు

మహబూబ్‌నగర్‌లో మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిర్మాణ పనులు ఆగిపోయిన వంతెన

నిజామాబాద్ జిల్లా నందిపేటలో పనులు నిలిచిపోయిన పద్మశాలీ కల్యాణ మండపం

నారాయణపేటలో నత్తనడకన సాగుతున్న జిల్లా కలెక్టర్ పరిపాలనా విభాగాల భవన సముదాయం పనులు