Minister Dayakar Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. మంత్రి సత్యవతితో కలిసి ఎర్రబెల్లి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు, కలెక్టర్లు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6న ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు అల్పాహార పథకం ‘సీఎం కేసీఆర్ బ్రేక్ఫస్ట్’ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని మంత్రులు ఆదేశించారు.
అదే రోజు హన్మకొండ, వరంగల్లో మంత్రి కేటీఆర్ పర్యటన సైతం ఉంటుందని, పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 3న నియోజకవర్గంలో అన్ని గ్రామాల క్రీడా ప్రాంగణంలో స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. 4న దళితబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ముమ్మరం చేసి త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.