హైదరాబాద్ అంటేనే హైపర్‌గా ఉంటాం
బిర్యానీ తింటూనే ఇరానీ ఛాయ్ అంటాం
మండే టు ఫ్రైడే మేం ఆఫీస్‌కే పోతాం
మెట్రో ఎక్కి దిగే దాక ముచ్చట్లే పెడ్తాం
ఐటీ మాదే ఫార్మా మాదే
సాటి లేని స్కిల్ ఉన్న సిటీ మాదే
కేబుల్ బ్రిడ్జి మీదికెక్కి కేరింతలు కొడతాం
స్కై వాక్ మీద మేము క్యాట్ వాకే చేస్తాం
సచివాలయం ముందు మేము సెల్ఫీలే దిగుతాం
అంబేదర్క్ బొమ్మకేమో సెల్యూటే కొడతాం
ఫస్టు మనమే.. బెస్టు మనమే..
అవార్డుల లిస్టుల్లో.. మస్టు మనమే…
బోనాల పండుగకు పూనకాలు తెస్తాం
దసరా ముంగట మేము బతుకమ్మ ఆడుతాం
మనది హైదరాబాదు.. దేశంలో మనదే జోరు
మన కేటీఆరు.. ఇగ చూడర జోరు
– తాండ గణేశ్, రేడియో మిర్చి (హైదరాబాద్ స్టేషన్)