వరంగల్ నగరంలో నిర్మించిన దేవాదాయ శాఖ భవనం (ధార్మిక భవన్) ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క-సారలమ్మ ఈవో, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం కార్యాలయాలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 21న ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మల్టీజోన్ పరిధిలోని 19 జిల్లాల పరిపాలన వ్యవహారాలు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి. – వరంగల్, నమస్తేతెలంగాణ ప్రతినిధి