Desapati Srinivas | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని.. సీఎం తన వైఖరి మార్చుకోవాలని మేథావులు చెప్పాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవి ప్రసాద్, ప్రతాప్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఎదుట సీఎం రేవంత్ మాట్లాడిన తీరు ఏమాత్రం బాగాలేదని.. మాజీ సీఎం కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం తప్పన్నారు. రుణమాఫీ అనేది అందరికీ అందేలా లేదని.. రైతు భరోసా ఏమయ్యిందని ప్రశ్నించారు. రైతులను రేవంత్ దగా చేశాడని.. రైతులకు, రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయితీని కాంగ్రెస్ పార్టీకి.. బీఆర్ఎస్ జరుగుతున్నట్లుగా డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
తనతో ఏం కాదన్న విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలని.. ఆయన గురువునే ఎదుర్కొన్నామని.. నువ్వెంత అన్నారు. ఎర్రొళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సిద్దిపేటకు, మైనంపల్లి హన్మంతరావుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. రేషన్ కార్డు ఉందా? ఆధార్ కార్డు నీకు ఇక్కడ ఉందా? అంటూ నిలదీశారు. హరీశ్‌రావుకు, హన్మంతరావుకు ఏమైనా పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఆయనో ఫుల్ టికెట్ అని.. కొడుకో ఆఫ్ టికెట్ అన్నారు. దమ్ముంటే రాజీనామా కొడుకుతో రాజీనామా చేయించి మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలవాలని సవాల్ విసిరారు. సిద్దిపేట అంటే కేసీఆర్, హరీశ్‌రావు అడ్డా అని.. రౌడీలది కాదన్నారు. కేసీఆర్ మాజీ సీఎం మాత్రమే కాదని.. తెలంగాణను సాధించిన మహానుభావుడని కొనియాడారు. వందకార్లతో వచ్చి సిద్దిపేటకు హన్మంతరావు ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.