హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ప్రతిపక్ష నాయకులైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనాగరికమని బీఆర్ఎస్ శాసన మండలి విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేతల నెత్తురు, కొవ్వును నరికి పొలాలకు పారించాలి‘ అనే రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత క్రూరమైన, హింసాత్మక వైఖరిని చూపుతున్నదని విమర్శించారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఫ్యాక్షన్ గద్దెపై కూర్చున్నట్టుగా ప్రవర్తించడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఎన్నడూ లేదని ధ్వజమెత్తారు. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ మాట్లాడే భాషలో కనీస సంసారం, విచక్షణ ఉండాలని హితవు పలికారు. దైవాలగూడ హంతకుడి మనస్తత్వాన్ని పోలిన ఈ తరహా వ్యాఖ్యలను రేవంత్ తక్షణమే వెనకి తీసుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.