హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కుంభవృష్టి కురిసినా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈదురుగాలు వీచినా, భారీ వర్షం ముంచెత్తినా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు అధికారులతో సీఎం సమావేశం
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు. సచివాలయంలోని 7వ అంతస్థులో ఈ సమావేశం జరుగనున్నది. ప్రజాపాలన దరఖాస్తులు, ధ రణి, వానకాలం పంటలు, సీజనల్ వ్యా ధులు, వన మహోత్సవం, విద్యారంగం, మహిళా శక్తి క్యాంటీన్లు, శాంతిభద్రతలు, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్‌పై చర్చించనున్నారు.
ఎక్సైజ్‌శాఖలో రూల్స్ ఆధారంగానే బదిలీలు
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో త్వరలో చేపటనున్న బదిలీలు ఏ ప్రాతిపదికన చేపట్టాలనే రూల్స్‌ను ఇప్పటికే సీఎస్ శాంతికుమారి దృష్టికి ఎక్సైజ్‌శాఖ తీసుకెళ్లింది. ప్రభుత్వ ఆమోదం త ర్వాత సాధారణ బదిలీల ప్రక్రియ కొనసాగనున్నది. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు 1500 మంది బదిలీకి అవకాశం ఉన్నట్టు సమాచారం.