హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సంపూర్ణంగా అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర మేధావుల కమిటీకి శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. నివేదికలోని అంశాల ఆధారంగా ఏ వర్గాలు తరతరాలుగా వెనుకబాటుకు గురయ్యాయో..?
సంపద, వనరులు అందని వర్గాల వివరాలు ఇవ్వాలని కోరారు. నివేదికలోని అంశాలను సమగ్రంగా విశ్లేషించి నెలరోజుల్లోగా ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు.