హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలో మహిళలకు విశిష్టాధికారాలు, హకులు, రాజకీయాల్లో వాటాకు రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పునాదులు వేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతెలిపారు. బాల్యవివాహాలు, వరకట్న నిషేధం, మ హిళలకు ఓటుహకు, విడాకులు, మహిళలకు ఆస్తిలో వాటా వంటి చట్టాలు అంబేదర్ హిందూ కోడ్ బిల్లు ద్వారానే ఆచరణలోకి వచ్చాయని గుర్తుచేశారు. హైదరాబాద్ తాజ్ డెకన్లో మంగళవారం జరిగిన స్త్రీ సమ్మిట్‌లో ఆయన మాట్లాడా రు. స్థానిక సంస్థల్లో 33శాతం మహిళలకు రిజర్వేషన్లను మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అమలు చేశారని తెలిపారు. దీంతో ఎన్నికలు, పరిపాలనా రంగంలోకి మహిళలు ఎక్కువ సంఖ్యలో రాగలిగారని చెప్పారు. మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. వచ్చే నాలుగేండ్లలో ప్రతి ఏటా 20వేల కోట్ల వడ్డీలేని రుణాలు మ హిళలకు అందజేస్తామని చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నూతన గ్రీన్‌పవర్ పాలసీలో మహిళలకు భాగస్వామ్యం కల్పించనున్నట్టు వివరించారు. విద్యుత్తు శాఖ, ప్రభుత్వంలోని ఇతర శా ఖలు కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలతో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు.
పకడ్బందీగా సంక్షేమం, అభివృద్ధి
రాష్ట్రంలో పకడ్బందీగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రూ.21వేల కోట్లతో రైతు రుణమాఫీ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ సూళ్లు, 56 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 8వేల కోట్లతో రాజీవ్ యువవికాసం, సన్న ధాన్యానికి రూ.500 బో నస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇదంతా ఒక ఎత్తయి తే.. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన పకడ్బందీగా పూర్తిచేశామని పేర్కొన్నారు.