హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : వర్షాలు, వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. బుధవారం సచివాలయంలో విద్యుత్తుశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా డిస్కం సీఎండీల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమీక్షలో ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, ఓఎస్డీ సురేందర్‌రెడ్డి, సింగరేణి సంస్థ సీఎండీ బలరాంనాయక్ పాల్గొన్నారు.