ఖమ్మం, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వీయ జనగణన వెబ్సైట్లో భద్రాచలం ఏపీలో ఉన్నట్టుగా చూపిస్తుండటం, భద్రాచల వాసులు స్వీయ జనగణన చేసుకునేందుకు అవాంతరం ఏర్పడటం వంటి అంశాలపై రెండు రోజుల క్రితం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. తాజాగా భద్రాచలం తెలంగాణలోనే ఉన్నట్టుగా చూపిస్తుండడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జనగణనకు మార్గం సుగమమైంది.