న్యూఢిల్లీ, ఆగస్టు 1: బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తాను 2015లో నీట్ పేపర్‌లీక్ బాధితురాలినని వెల్లడించారు. ఆర్థికంగా వెసులుబాటు, తల్లిదండ్రుల మద్దతు ఉన్నా..తాను ఆనాడు మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయని అన్నారు.
తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ నీట్ కోసం తనకు ఎంతో ఇష్టమైన కూచిపూడి,పెయింటింగ్‌లను ఏడాది పాటు పూర్తిగా వదిలేశానని, డాక్టర్ కావాలన్న కల కోసం ఎంతో శ్రమించానని, ఆ ఏడాది పేపర్ లీక్ కారణంగా మళ్లీ పరీక్ష రాయటం తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఆనా డు జీవితంలో తాను అత్యంత కఠినమైన దశను ఎదుర్కొన్నానని చెప్పారు. మళ్లీ 45 రోజులు ప్రిపేర్ కావాల్సి రావటం మానసికంగా క్రుంగదీసిందని మానుషి అన్నారు.