Prakash Raj : సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. దేశంలో గణేష్ నిమజ్జనం పూర్తైందని, జ్ఞానేష్ నిమజ్జనం మిగిలి ఉందని ప్రకాష్ రాజ్ అన్నారు. సర్‌కు వ్యతిరేకంగా, అలాగే, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా వివిధ పక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
ప్రధానంగా ఢిల్లీలో, ఆ తర్వాత ముంబైలో భారీ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొనాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. సీఈసీని తొలగించే వరకు జరిగే ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. సీఈసీ రాజీనామా కోరుతూ సీజేపీ కూడా ఆందోళన చేపట్టనున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. కాక్రాచ్లు వస్తున్నారు.. హ్యాపీ జయంతి అంటూ చెప్పుకొచ్చారు.
Cockroaches are back .. 💪💪💪. Happy Gandhi Jayanthi #PeacefulProtests #ScrapSIR #SaveDemocracy #justasking pic.twitter.com/yEFonpz3KV
— Prakash Raj (@prakashraaj) October 2, 2026
హ్యాపీ మహాత్మా గాంధీ జయంతి. ఈ రోజు బాపు బర్త్‌డే. ఈ రోజును ఘనంగా జరుపుకొంటున్నప్పటికీ కొంతమంది గూండాలు ఇంకా గాంధీని చంపిన గాడ్సేను పొగుడుతారు అంటూ ప్రకాష్ రాజ్ అన్నారు. వాళ్లంతా మన పౌరసత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని సర్ ద్వారా అణచివేయాలని చూస్తున్నారు అంటూ ప్రకాష్ రాజ్ విమర్శించారు. అయితే, పౌర సమాజం, దేశ యువత, కాక్రోచ్లు ఇలాంటివి జరగనివ్వరు అంటూ ఆయన అన్నారు. జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాల్సిన సమయం వచ్చిందంటూ ప్రకాష్ రాజ్ అన్నారు.