తిరుమల : ఏడుకొండల స్వామిని దర్శించుకునేందుకు తిరుమల ( Tirumala ) కు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న వేంకటేశ్వరస్వామిని 78,026 మంది భక్తులు దర్శించుకోగా 31,116 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి రూ. 5.12 కోట్ల ఆదాయం ( Hundi kanukalu ) వచ్చిందన్నారు. 4.21 లక్షల లడ్డూలను విక్రయించామని, 3.13 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వెల్లడించారు.