న్యూఢిల్లీ: పెరుగుతున్న రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ల సంఖ్య కారణంగా అంతరిక్ష వ్యర్థాల(స్పేస్ జంక్) ముప్పు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నది. పోలాండ్ అంతరిక్ష సంస్థకు చెందిన స్పేస్ సిచుయేషనల్ అవేర్నెస్ ఆపరేషన్స్ హెడ్ మారియస్ స్లోనియా వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి వారం సుమారు ఒక మెట్రిక్ టన్ను బరువైన అంతరిక్ష వ్యర్థాలు భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నాయి. పదేండ్ల క్రితం 110గా ఉన్న హెచ్చరికల సంఖ్య 2025 నాటికి ఏకంగా 820కి చేరినట్లు యూఎస్ స్పేస్ ఫోర్స్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.