నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దట్టమైన పొగ మంచు (Dense Fog) ఆవరించింది. వేకువ జామున భారీగా పొగ మంచు కురవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందూరు పట్టణంలో కనుచూపుమేరలో పొగ మంచు నెలకొంది. ముందు వెళ్తున్న వాహనాలు కనింపకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని ముందుకు సాగారు. చలితో ప్రజలు వణికిపోయారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో కూడా పొగమంచు భారీగా గురిసింది. జిల్లాలోని జన్నారం, దండేపల్లి మండలాల్లో పొగమంచు అలముకున్నది.