హైదరాబాద్ : రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు(Demolition) కొనసాగుతున్నాయి. దీంతో సమాన్యులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో(Huzurnagar) హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా, ఓ సెలూన్ షాప్ను కూల్చివేయడంతో బాధితుడి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది. ప్లీజ్ నా మంగలి షాప్ కూల్చకండి సార్..బతుకు తెరువుపై కొట్టొద్దని వేడుకున్నారు. జేసీబీకి అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు.
అయినా అధికారులు షాప్ను నేలమట్టం చేశారు. చేతి వృత్తిదారులపై అధికారులు ప్రతాపం చూపిస్తుం డటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మా పొట్ట కొట్టొద్దని వేడుకుంటున్నారు. మరోవైపు కూల్చి వేతలపై అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పెద్దలను వదిలి రోడ్డు పక్కన పని చేసుకునే సామాన్యుల మీదేనా మీ ప్రతాపం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్లీజ్ నా మంగలి షాప్ కూల్చకండి సార్
రోడ్డు పక్కన పని చేసుకునే వారి మీదేనా మీ ప్రతాపం
హుజూర్ నగర్లో కూల్చివేతలు
చేతి వృత్తిదారులపై అధికారుల ప్రతాపం
లబోదిబోమంటున్న బాధితులు
బ్రతుకుతెరువుపై కొట్టొద్దని వేడుకుంటున్న ఓ మంగలి షాప్ బాధితుడు
గోడు వినకుండా ముందుకుపోతున్న మున్సిపల్… pic.twitter.com/RQtLyLVxVZ
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2024