యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ శ్రేణు పై దాడులకు పాల్పడుతున్నది. తాజాగా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం(Mallapuram)లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని(BRS party office) కూల్చివేశారు.100 పోలీసుల పహారాతో జేసీబీతో నేలమట్టం చేశారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పేరిట రెండేండ్ల క్రితం 150 గజాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. కాగా, అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దురాగాతాలకు ఒడిగడుతున్నాడు.
బీఆర్ఎస్పై దాడులకు పాల్పడుతూ గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరుపై మల్లాపురం గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.