నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) చారకొండలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై 29 ఇండ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మంగళవారం ఉదయం భారీ బందోస్తు మధ్య గ్రామానికి చేరుకున్న అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 400 మందికిపైగా పోలీసులను మోహరించారు.
అయితే గ్రామం మధ్య నుంచి బైపాస్ తీసుకెళ్లడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగినవారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూల్చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన ఇంటిని కూలగొట్టందంటూ ఇద్దరు పిల్లలతో కలిసి గిరిజమ్మ అనే మహిళ గృహనిర్బంధం చేసుకున్నారు. అతికష్టంపై ఆమెను పోలీసులు బయటకు తీసుకొచ్చి స్టేషన్కు తరలించారు. అయితే జీవో జారీ చేసిన తర్వాతే ఇండ్ల కూల్చివేతలు చేపట్టామని అధికారులు వెల్లడించారు.