అయిజ రూరల్, ఫిబ్రవరి 21: బహిరంగ మార్కెట్ ధర ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం సమీపంలో భారత్మాల రోడ్డు కోసం భూము లు కోల్పోయిన రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా గ్రామాల భూనిర్వాసితులు మంగళవారం భారత్మాల రోడ్డు పనులను అడ్డుకొని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు బహిరంగ మార్కెట్లో ఉన్న ధరను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.6 లక్షల నుంచి రూ.7లక్షలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకొన్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రాజోళి ఎస్సై, తహసీల్దార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.