న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉందని, సామాన్యులకు ఎయిర్ ప్యూరిఫయర్లు అందుబాటులో ఉండటం కోసం, వాటిపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి ఎందుకు తగ్గించకూడదని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వెంకటరమణి అంతకుముందు వాదనలు వినిపిస్తూ, జీఎస్టీ కౌన్సిల్ రాజ్యాంగ వ్యవస్థ అని, దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అంగీకరించాల్సి ఉంటుందన్నారు. విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.