హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని సర్వే నంబర్ 63లో ప్రభుత్వానికి చెందిన 78 ఎకరాల్లో 52 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ గతంలో ఆ జిల్లా కలెక్టర్ అమో య్ కుమార్ జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కలెక్టర్ ఉత్తర్వులు సరికాదని, ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా రిజిస్ట్రేషన్‌కు వీలుకల్పించడం చెల్లదని జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం వెలువరించిన తీర్పులో స్పష్టం చేశారు.
జస్టిస్ లక్ష్మణరావుకు హైకోర్టు నివాళి
అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావుకు తెలంగాణ హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది. ఈనెల 17న హైదరాబాద్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి: రవి
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తేతెలంగాణ) : పరిశ్రమలు కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ రవి సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించే పరిశ్రమలను మూసివేస్తామని హెచ్చరించారు. మంగళవారం సనత్‌నగర్‌లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయంలో ఆయన అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇవేం సెక్షన్లు.. అమలులో సవాళ్లు
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కొత్త సెక్షన్లపై పట్టు దొరక్కపోవటంతో ఇబ్బందిగా మారుతోందని క్షేత్రస్థాయి పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం డీజీ పీ జితేందర్, సీఐడీ డీజీ శిఖాగోయెల్, టెక్నికల్ ఏడీజీ వీవీ శ్రీనివాస్ నేతృత్వంలో సీపీలు, ఎస్పీలు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్డీపీవోలు, ఎస్‌హెచ్‌వోలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌హెచ్‌వోలు.. కేసుల నమోదులో ఎదురవుతున్న సవాళ్లను ఉన్నతాధికారులకు ఏకరువు పెట్టారు. ఈ-సాక్ష్యం యాప్‌పై వర్చువల్ మీటింగ్‌లో అవగాహన కల్పించారు.