హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పునరుద్ధరణకు చేపట్టాల్సిన పనుల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలను రూపొంచించారు. సాగునీటి పారుదల శాఖ స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ)లో పునరుద్ధరణ పనులపై చర్చించారు.
ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ నేతృత్వంలో శుక్రవారం కొనసాగిన ఈ సమావేశంలో సొరంగం పునరుద్ధరణకు తీసుకోవాల్సిన అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. అధికారులు ఇప్పటికే రూ.2.30 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధంచేశారు. ఎన్జీఆర్ఐ తదితర సంస్థల సహకారంతో సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. అదనంగా ఇన్వెస్టిగేషన్ సర్వే నిర్వహించాల్సి రావడం, టీబీఎం స్థానంలో డీబీఎం విధానంలో ముందుకు పోవాలని యోచిస్తున్నారు.
ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అనుమతుల కోసం ప్రభుత్వానికి ఫైలును పంపాలని కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా 15న నిర్వహించబోయే క్యాబినెట్ భేటీలో ఎస్ఎల్బీసీపై సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.