TS Assmebly Session | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం భారీ వర్షాలు, వరదలపై చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభల్లోనూ మొదట ప్రశ్నోత్తరాలు చేపడతారు. అనంతరం స్వల్పకాలిక చర్చలో భాగంగా అసెంబ్లీలో భారీ వర్షాలు, వరదలు ప్రభావంపై చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. శుక్రవారం పలు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో మండలిలో విద్య, వైద్యంపై చర్చ జరగనుంది.