Telangana | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో 36.5, భధ్రాద్రి-కొత్తగూడెంలో 35.6, హనుమకొండ, హైదరాబాద్‌లో 34, ఖమ్మంలో 34.6, మహబూబ్‌నగర్ 36.1,మెదక్ 34.8, నల్లగొండలో 31.5, నిజామాబాద్‌లో 34.5, రామగుండంలో 34 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే వారం రోజులు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
JEE Main | ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ -2 పరీక్షలు
KTR | ఇది చారిత్రాత్మక విజయం.. గొంగడి త్రిషకు ప్రత్యేక అభినందనలు : కేటీఆర్
Harish Rao | బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వం హత్యే : హరీశ్‌రావు