KTR | హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా అండర్-19 వుమెన్స్ జట్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయం అని కొనియాడారు. భారత్‌కు చెందిన అండర్-19 వుమెన్స్ జట్టు.. టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడం మనల్ని గర్వపడేలా చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు.
టీమిండియా వుమెన్స్ జట్టుకు భవిష్యత్‌లో ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా రాణించిందని ప్రశంసించారు. టీమిండియా గెలుపునకు ఎంతో సహకారం అందించిన త్రిషకు ప్రత్యేక అభినందనలు చెప్పారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను గెలుచుకున్న త్రిష మ్యాచ్‌ను ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చారని కేటీఆర్ ప్రశంసించారు.
Historic win! 🎉
India’s U-19 Women’s team has made us proud by clinching the ICC U-19 Women’s T20 World Cup 2025!
A dominant all-round performance. Wishing them a bright future ahead! 🇮🇳🏆
Special congratulations to Telangana girl Gongadi Trisha for her stellar contribution!… pic.twitter.com/sQ2KIVkhcH
— KTR (@KTRBRS) February 2, 2025
ఇవి కూడా చదవండి..
Caste census | తెలంగాణలో బీసీ జనాభా 46.25 శాతం.. 4న క్యాబినెట్ ముందుకు కులగణన నివేదిక
Harish Rao | భేషజాలకు పోకుండా హైడ్రా దుకాణం బంద్ చేయండి : హరీశ్‌రావు
Harish Rao | బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వం హత్యే : హరీశ్‌రావు