JEE Main | హైదరాబాద్ : దేశవ్యాప్తంగా గల ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్/ బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరయ్యేవారు ఈ నెల 25 రాత్రి 9 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. ఇక రాత్రి 11.50 గంటల వరకు ఫీజును స్వీకరిస్తామని సంస్థ ప్రకటించింది.
జేఈఈ మెయిన్ -1 పరీక్షలను జనవరిలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుండగా, మెయిన్ -2 పరీక్ష షెడ్యూల్‌ను ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ -2కు ఎప్‌సెట్ పరీక్షకు మధ్య వ్యవధి 20 రోజులే ఉండనుంది. ఈ ఏడాది ఎప్‌సెట్‌ను ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జేఈఈ పరీక్షలు ముగిసిన తర్వాత ఎప్‌సెట్ పరీక్షలు జరగనుండగా విద్యార్థుల మధ్య ఒత్తిడి తగ్గే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనాలేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇది చారిత్రాత్మక విజయం.. గొంగడి త్రిషకు ప్రత్యేక అభినందనలు : కేటీఆర్
Caste census | తెలంగాణలో బీసీ జనాభా 46.25 శాతం.. 4న క్యాబినెట్ ముందుకు కులగణన నివేదిక
Harish Rao | భేషజాలకు పోకుండా హైడ్రా దుకాణం బంద్ చేయండి : హరీశ్‌రావు