హైదరాబాద్, డిసెంబర్7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పద్మశాలీల అ భ్యున్నతికి రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్, పద్మశాలీ కార్పొరేషన్లను ఏర్పాటు చే యాలని కోరారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పద్మశాలి సామాజిక వర్గానికి ప్ర భుత్వ శాఖల్లో ప్రాతినిధ్యమే కరువైందని విమర్శించారు.
తెలంగాణ ఆవిర్భావం, అనంతర పరిణామాల్లో పద్మశాలీలు కీలకపాత్ర పోషించారని, దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో విస్తరించి, ప లు రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్న పద్మశాలీలను తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పేర్కొన్నా రు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన నామినేటెడ్, విశ్వావిద్యాలయాల ఉపకులపతుల నియామకాల్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు.