హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆధ్వర్యంలో శాసనమండలి వేదికగా దాసోజు ప్రమాణం చేశారు. తొలుత గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి బీఆర్ఎస్ పక్షనేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డి, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, భిక్షమయ్యగౌడ్, బాల్క సుమన్, నేతలు గజ్జెల నగేశ్, గెల్లు శ్రీనివాస్‌యాద్, ఆంజనేయగౌడ్, కిశోర్‌గౌడ్, జయసింహ, సుమిత్రానంద్, కుర్వ విజయ్, సతీశ్, శుభప్రద్ పటేల్, రంగినేని అభిలాశ్, నర్సిరెడ్డి, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరై పుష్పగుచ్ఛాలు అందజేసి దాసోజుకు శుభాకాంక్షలు తెలిపారు.
అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గత 18 ఏండ్లుగా రాజకీయ కార్యకర్తగానే ఉన్న తనకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి రాజకీయ పునర్జన్మ ప్రసాదించారని పేర్కొంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం నాంపల్లిలోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనను అంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన నేతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.