హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : రైతుల నోట్లో మట్టికొట్టి రక్త చరిత్ర రాయాలనుకొంటున్న రేవంత్‌రెడ్డిది రాక్షస పాలన అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. నీళ్లు ఇచ్చి పంటలు కాపాడాలని వేడుకుంటున్న రైతులను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడటం దుర్మార్గమని ఒక ప్రకటనలో మండిపడ్డారు.
నీళ్లివ్వమని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుపై అక్కసు వెళ్లగక్కడం.. వారి రక్తంచల్లితే పంటలు పండుతాయని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? అని ప్రశ్నించారు. కనీస సభ్యతలేని భాష మాట్లాడేందుకు నోరెలా వచ్చిం ది? రేవంత్‌రెడ్డీ.. అని పేర్కొన్నారు.