రాష్ట్రలోభూముల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. తాజాగా దళితుల భూములను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 255/1లో ఉన్న 18 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేద రైతులకు పట్టాలు ఇచ్చంది. సదరు భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నింది. ప్రస్తుతం ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు భూములు లాక్కుంటే ఎలా అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. మా భూములు మాకే కావాలని నినదించారు.
మరో దళితుల భూమిపై కన్నేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పట్టాలు ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 255/1లో ఉన్న 18 ఎకరాల భూమిని అర్హులైన పేద రైతులకు పట్టాలు ఇచ్చిన గత… pic.twitter.com/MYLK6Y56gi
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026