యాదాద్రి భువనగిరి, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు గురువారం రోడ్డెకారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని మదర్ డెయిరీ చిల్లింగ్ సెంటర్ ఎదుట వరంగల్ హైవేపై భువనగిరి మండలం వీరవెల్లి పాల రైతులు బైఠాయించటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బిల్లుల చెల్లించాలంటూ పాల క్యాన్లతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో అధికారులతో వాగ్వాదం జరిగింది.
జీతాలు తీసుకుంటున్నట్టుగానే తమ పాల బిల్లు లు ఎందుకు ఇవ్వడం లేదంటూ అధికారులను నిలదీశారు. వీరవెల్లికి చెందిన సుమా రు 120 మంది రైతులకు రూ.24 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పశుపోషణ భారమైన పరిస్థితుల్లో బిల్లుల పెండింగ్‌తో తాము మరిన్ని ఇబ్బందులు ఎదురోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.