హైదరాబాద్ : తెలంగాణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. గత పది, పదిహేను నెలల నుంచి చాలా మంది ఉద్యోగులకు జీతాలు రాకపోవడంతో.. కుటుంబ పోషణ భారంగా మారింది. అప్పులు చేసి మరి కుటుంబాన్ని పోషిస్తున్నారు.
తాజాగా ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికులు.. కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టించారు. 10 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బతకాలని ప్రభుత్వాన్ని కార్మికులు నిలదీశారు. ఎమ్మెల్యే వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రూ. 13000 ఉన్న జీతాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 11700 కుదించడంపై కార్మికులు మండిపడ్డారు. 26 రోజులుగా ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇప్పటికీ సమస్యలపై స్పందించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మికులు మండిపడుతున్నారు.
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడి
10 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బతకాలని ప్రభుత్వాన్ని నిలదీత
ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు
నాగర్ కర్నూల్ జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికులు
కేసీఆర్… pic.twitter.com/R6CiYw3wdN
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2025