మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 16:37:11

సైక్లింగ్స్ ఫర్ ఛాలెంజ్.. రాష్ట్రంలో మూడు నగరాలకు స్థానం

సైక్లింగ్స్ ఫర్ ఛాలెంజ్.. రాష్ట్రంలో మూడు నగరాలకు స్థానం

హైదరాబాద్ : సైక్లింగ్స్ ఫర్ ఛాలెంజ్ లో దేశ వ్యాప్తంగా 141 నగరాలను ఎంపిక చేయగా.. అందులో రాష్ట్రంలోని మూడు నగరాలకు అవకాశం దక్కిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. సైక్లింగ్స్ ఫర్ ఛాలెంజ్ కురాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లు ఎంపిక కాగా, ఈ మూడు నగరాల్లో సొంతంగా సైకిళ్లను ఉపయోగించడంపై ప్రజల్లో చైతన్యం చేసేందుకు కేంద్రం దృష్టిని సారించనున్నట్లు  వినోద్ కుమార్ పేర్కొన్నారు. నగరాల్లో పెరిగిపోతున్న వాయు, ధ్వని కాలుష్యాన్ని అరికట్టడం, పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రజల ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపర్చడం, జీవన ఖర్చులను తగ్గించడం వంటి లక్ష్యాలతో సైక్లింగ్స్ ఫర్ ఛాలెంజ్ కార్యక్రమానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ శ్రీకారం చుట్టిందని వినోద్ కుమార్ చెప్పారు.


సైక్లింగ్ వల్ల ధనిక, పేద,  వృద్ధులు, పిల్లలు, పురుషులు, మహిళలు అన్న భేదం లేకుండా ఉంటుందని, నగరాలు, తద్వారా వీధులు ట్రాఫిక్ పరంగా సురక్షితంగా ఉంటాయని వినోద్ కుమార్ వివరించారు. సైక్లింగ్ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్దేశంతో పాటు శారీరక  ధారుడ్యం, మెరుగైన ఆరోగ్య జీవనం అలువర్చుకునేందుకు సైక్లింగ్స్ ఫర్ ఛాలెంజ్ ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

నగరంలో ఒక చోట తీసుకున్న సైకిల్ ను మరోచోట నిర్ధేశిత ప్రదేశంలో వదిలివెళ్లే అవకాశం ఉందని వినోద్ కుమార్ తెలిపారు.ప్రజలు సొంతంగా సైకిళ్లను ఉపయోగించుకోవచ్చని, దాతల ద్వారా సేకరించే సైకిళ్లను మున్సిపల్ కార్పోరేషన్ లు ప్రజలకు అందుబాటులో ఉంచుతాయని వినోద్ కుమార్ వివరించారు. సైక్లింగ్స్ ఫర్ ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆయా నగరాల మున్సిపల్ కమిషనర్ లు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.logo